Telangana: తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్

  • రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తున్నారు
  • టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జైల్ భరో చేపడతాం
  • మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి విజయం తథ్యం
తెలంగాణలో రాజకీయాలు భ్రష్టు పట్టాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో మోదీ మతపరమైన రాజకీయాలు చేస్తుండగా, రాష్ట్రంలో కేసీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి విజయం తథ్యమని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. త్వరలోనే జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ? రుణ మాఫీ ఎక్కడ? రైతు బంధు ఎక్కడ? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకటనకు, నామినేషన్లకు మధ్య ఒక్కరోజే గడువు ఉందన్నారు. దాన్ని వారం రోజులకు పెంచాలని ఈసీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
Telangana
TPCC Chief
Uttam Kumar Reddy
criticism
TRS
CM KCR

More Telugu News