Apsrtc: ఆర్టీసీ కార్మికుల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు: మంత్రి పేర్ని నాని

  • విజయవాడలో ఆర్టీసీ కార్మికుల కృతజ్ఞత సభ
  • ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారు
  • మాట ఇస్తే నిలబెట్టుకునే దృఢ సంకల్పం జగన్ ది
ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, ఆర్టీసీ కార్మికుల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆర్టీసీని నాశనం చేశారని, జగన్ అధికారంలోకి రాగానే దానికి జీవం పోశారని అన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే దృఢ సంకల్పం జగన్ ది అని, ఆర్టీసీ విలీనం సాధ్యమవుతుందా అనే వారికి, విలీనం చేసి జగన్ చూపించారని అన్నారు.
Apsrtc
cm
jagan
Minister
Perni Nani

More Telugu News