CBI: నాపై సీబీఐ, యూనియన్ బ్యాంకులు తప్పుడు కేసులు పెట్టాయి: రాయపాటి

  • ట్రాన్స్ ట్రాయ్ బాధ్యతలను చెరుకూరి శ్రీధర్ చూసేవారు
  • పోలవరం నుంచి తప్పించడంతో భారీ నష్టం వాటిల్లింది
  • కంపెనీ బ్యాలెన్స్ షీట్లపై మాత్రమే నేను సంతకం చేశాను
ట్రాన్స్ టాయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందిస్తూ, ఈ కేసులతో తనకు సంబంధం లేదని అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తానే ప్రారంభించినప్పటికీ... తన రాజకీయాల కారణంగా కంపెనీ బాధ్యతలను సీఈవో చెరుకూరి శ్రీధరే చూసేవారని చెప్పారు.

కంపెనీని స్థాపించిన తర్వాత 14 బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నుంచి తప్పించడంతో ట్రాన్స్ ట్రాయ్ కు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్లపై మాత్రమే తాను సంతకం చేశానని... సంస్థ రోజువారీ కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ తప్పు చేయదని తాను నమ్ముతున్నానని చెప్పారు. సీబీఐ, యూనియన్ బ్యాంకులు తనపై తప్పుడు కేసులు పెట్టాయని ఆరోపించారు.
CBI
Union Bank
Rayapati Sambasiva Rao
Telugudesam

More Telugu News