Chandrababu: ఆ తర్వాతే నన్ను, కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకునేవారు: నారా భువనేశ్వరి

  • అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు
  • ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం కష్టపడ్డారు
  • మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నాను
  • ఎల్లప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారు
అమరావతి రైతుల నమ్మకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వమ్ము చేయరని ఆయన భార్య భువనేశ్వరి అన్నారు. ఏపీలోని ఎర్రబాలెంలో రైతుల దీక్షలో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం కష్టపడ్డారని తెలిపారు. ప్రజల తరువాతే, తనను, కుటుంబాన్ని పట్టించుకునే వారని ఆమె వ్యాఖ్యానించారు.

మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నానని భువనేశ్వరి అన్నారు. ఏపీని నంబర్ వన్ గా చేయడానికి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని ఆమె తెలిపారు. రాత్రింబవళ్లు చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. ఎల్లప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారని అన్నారు. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News