Chandrababu: పవన్ కల్యాణ్ వస్తే ఆయన ముందు ముళ్లను అడ్డుగా పెట్టారు: చంద్రబాబు విమర్శలు

  • వైసీపీపై చంద్రబాబు విమర్శలు
  • నిన్న పవన్ కల్యాణ్ ను అడ్డుకోవాలని చూశారు
  • రైతుల కష్టాలు వింటుంటే బాధేస్తోంది
అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తే ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 'నిన్న పవన్ కల్యాణ్ ను అడ్డుకోవాలని చూశారు. రహదారిపై ముళ్లను అడ్డుగా పెట్టి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లారు.. ఆయనను ప్రజలే కాపాడుకుంటూ తీసుకెళ్లారు' అని వ్యాఖ్యానించారు. వైసీపీ చర్యలు సరికాదని అన్నారు.

గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము కూడా ఇలాగే ముళ్ల కంచెలు అడ్డుపెడితే ఎలా తన యాత్రను ఎలా కొనసాగించేవారని చంద్రబాబు ప్రశ్నించారు. రైతుల కష్టాలు వింటుంటే బాధేస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడ గ్రాఫిక్ చూపించామని వైసీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడి రహదారులు, భవనాలు వారికి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు.
Chandrababu
YSRCP
Pawan Kalyan

More Telugu News