కేరళ జిహాదీ గ్రూపులకు ఈ దేశాల నుంచి నిధులు అందుతున్నాయి: ఇంటెలిజెన్స్
- దుబాయ్, టర్కీ దేశాలకు అందుతున్న నిధులు
- స్పందించిన కేంద్ర హోం శాఖ
- పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
అక్టోబర్ 1న ఇతర గ్రూపులకు చెందిన ముష్కరులు టర్కీ, ఖతార్ దేశాలకు చెందిన కొందరిని కలిశారని... ఆ సందర్భంగా కావాల్సినన్ని నిధులను అందిస్తామనే హామీని వారు ఇచ్చారని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ స్పందించింది. విదేశాల నుంచి దేశంలోని జిహాదీ గ్రూపులకు అందుతున్న నిధులకు సంబంధించి పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఏయే దేశాల నుంచి, ఎవరెవరి నుంచి, ఇక్కడ ఎవరెవరికి, ఎంతెంత మొత్తం అందిందో వివరాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.