Jagan: నూతన సంవత్సరం రోజున జగన్ రైతులను రోడ్డుపై నిలబెట్టాడు: కేశినేని నాని

  • రాజధానిని అమరావతి నుంచి తరలించడం ఎవరితరం కాదు
  • రైతులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు
  • చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతాం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం ఎవరితరం కాదని ఆయన అన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి రాజధాని కోసం తాము చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని కేశినేని నాని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతి రైతులను రోడ్డుపై నిలబెట్టాడని ఆయన విమర్శలు గుప్పించారు.
Jagan
Kesineni Nani
Telugudesam

More Telugu News