Srikakulam District: భర్తకు అంతిమ సంస్కారం నిర్వహించిన భార్య

  • కిడ్నీ వ్యాధిన పడి జీవిత భాగస్వామి మృతి  
  • మగ దిక్కు లేకపోవడంతో తప్పని పరిస్థితి 
  • శ్రీకాకుళం జిల్లా డోకులపాడులో ఘటన

సంప్రదాయం మనిషికే తప్ప మనసుకు కాదని, ఆత్మీయానురాగాలు పంచాల్సిన చోట పద్ధతులు, విధానాలు అని పట్టుకుని వేలాడితే చనిపోయిన వారి ఆత్మ క్షోభిస్తుందని, అటువంటి సందర్భంలో మనసుకు నచ్చింది చేయడమే సరియైనదని నిరూపించింది ఆ భార్య. కిడ్నీ వ్యాధి భర్తను మింగేసింది. అంతకు ముందు భర్త తండ్రిని అదే వ్యాధి పొట్టన పెట్టుకుంది. మిగిలింది తాను, ఐదేళ్ల కుమార్తె మాత్రమే. ఇక తప్పని పరిస్థితుల్లో భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది భార్య. 

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వడ్డి సూర్యప్రకాశ్, విజయ దంపతులు. ఉద్దానాన్ని కబళిస్తున్న కిడ్నీ వ్యాధి బాధితుల్లో సూర్యప్రకాశ్ కూడా చేరి కన్నుమూశాడు. దీంతో ఇన్నాళ్లూ తనకు తోడూ నీడై నిలిచిన భర్తకు అంతిమ సంస్కారం నిర్వహించి రుణం తీర్చుకుంది అతని భార్య విజయ.

Srikakulam District
vjrapukotthuru mandal
funaral
wife

More Telugu News