Chandrababu: అందుకు ఖర్చు పెట్టే డబ్బు విరాళంగా ఇవ్వండి: చంద్రబాబు

  • వేడుకల డబ్బు రైతులకు ఇవ్వండి
  • ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలి
  • ట్విట్టర్ లో చంద్రబాబునాయుడు
నేడు నూతన సంవత్సరం వేడుకలకు పెట్టాలనుకున్న ఖర్చును అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతులకు విరాళంగా ఇవ్వాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో విజ్ఞప్తి చేశారు.

" వేడుకలకయ్యే ఖర్చులను రైతులకోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి జెఎసిలకు విరాళంగా ఇవ్వాలి.రాజధాని అమరావతి పరిరక్షణ రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలి.రాబోయే నూతనసంవత్సరంలో అన్నివర్గాల ప్రజల ధన, మాన, ప్రాణాలకు భద్రత ఏర్పడాలని, వారి సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నాను" అంటూ ఆయన ఓ పోస్ట్ ను పెట్టారు.

అంతకుముందు "అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఏ వేడుకైనా శోభాయమానంగా ఉంటుంది. కానీ ఈ రోజు అమరావతి రైతులు సంతోషంగా లేరు. వారికి సంఘీభావంగా 2020 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తెదేపా నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చాం" అని అన్నారు.
Chandrababu
Twitter
Amaravati
Farmers

More Telugu News