Kamal Haasan: కమలహాసన్ పై గౌతమిని ప్రయోగించే ఆలోచనలో బీజేపీ!

  • మక్కల్ నీది మయ్యమ్ తో దూసుకొస్తున్న కమల్
  • కమల్ ను అడ్డుకోవాలన్న ఆలోచనలో బీజేపీ
  • గౌతమికి కీలక పదవిని ఇవ్వాలన్న ఆలోచన
తమిళనాట మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ నటుడు కమలహాసన్ కు చెక్‌ చెప్పేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ, అందుకు, అతని మాజీ భార్య, తమ పార్టీలో ఉన్న గౌతమిని వినియోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీపై కమల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కమల్ ఆరోపణలను ఇకపై గౌతమి ద్వారా తిప్పి కొట్టించాలని ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కల్పించాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమిళనాడులో పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం 5వ తేదీన ఢిల్లీలో అభిప్రాయ సేకరణ జరుగనుండగా, అదే రోజున గౌతమికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది.

కమలహాసన్, నటి గౌతమిలు కొన్నాళ్ల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. తాను ఏర్పాటు చేసిన పార్టీతో కమల్ రాజకీయ ప్రయాణంలో బిజీ కాగా, గౌతమి టీవీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో సాగుతున్నారు. ఇటీవల ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో సైతం భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగం అయ్యారు. దీంతో కమల్ కు దీటైన సమాధానం చెప్పాలంటే గౌతమి మాత్రమే తమకు సరైన ఆప్షన్ అని బీజేపీ భావిస్తోంది.
Kamal Haasan
Goutami
BJP

More Telugu News