Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ

  • నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఇష్టం
  • పవన్ గారూ.. నన్ను క్షమించండి
  • పవన్ అందుకే సూపర్ స్టార్ అయ్యారు
ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు తెలిపారు. తనకు శ్రీదేవి కంటే పవన్ కల్యాణ్ అంటేనే ఇష్టమని పేర్కొన్న వర్మ.. తనను క్షమించాలని వేడుకున్నారు. వర్మ నిర్మాతగా రూపొందిన ‘బ్యూటిఫుల్’ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రి న్యూ ఇయర్ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. గతంలో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు.

తన మనసులోని మాటను ఈ రోజు తాను బయటకు చెప్పాలని అనుకుంటున్నానని పేర్కొన్న వర్మ, పవన్ గారికి ఓ తిక్కుందని, లెక్క కంటే తిక్కే అందరికీ ఎక్కువగా నచ్చుతుందని పేర్కొన్నారు. ఆయన అందుకే సూపర్ స్టార్ అయ్యాడన్నారు. ‘పవన్ గారూ.. నన్ను క్షమించండి’ అని కోరారు. తనకు శ్రీదేవి కంటే పవన్ కల్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టమని ప్రమాణ పూర్తిగా చెబుతున్నానని వర్మ తెలిపారు. తాను దేవుడ్ని నమ్మనని, తన మాటలను నమ్మకపోతే ఏమీ చేయలేనని వర్మ స్పష్టం చేశారు.

కాగా, రాంగోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ‘బ్యూటిఫుల్’ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ మహిళ తన కంటే సక్సెస్‌పుల్ అయితే మగాడు భరించగలడా? అన్న కథాంశంతో ఈ సినిమాను తీసినట్టు వర్మ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Pawan Kalyan
Ramgopal varma
Beautiful

More Telugu News