Amaravathi: రాజధాని రైతులు ఆనందంగా ఉన్న రోజే నాకు పండగ: ‘జనసేన’ అధినేత పవన్

  • కొత్త సంవత్పరం, సంక్రాంతి వేడుకలు జరుపుకోలేను
  • రైతుల బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా
  • న్యూ ఇయర్ విషెస్ చెప్పలేకపోతున్నా.. బాధగా ఉంది
రాజధాని అమరావతి రైతులు రోడ్లపైకి రావాల్సి రావడం దురదృష్టకరమని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్పరం, సంక్రాంతి పండగ వేడుకలు నిర్వహించేందుకు తన మనసు అంగీకరించడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటించారు. ప్రభుత్వం తీరును నిరసించేందుకు ఎన్నడూ గడపదాటని మహిళలు సైతం రోడ్లపైకి రావడం దౌర్భాగ్యం అని అన్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నానని, రైతులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉన్న రోజే తనకు నిజమైన సంక్రాంతి పండగ అని అన్నారు.
Amaravathi
capital
janasena
Pawan Kalyan

More Telugu News