Amaravathi: ఆ 29 గ్రామాలు తప్ప, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు టీడీపీకి పట్టవు!: మంత్రి కన్నబాబు

  • టీడీపీకి ఇంకెవరి మీద ప్రేమ లేదా?
  • టీడీపీ తీరు చూస్తుంటే అలాగే ఉంది
  • పెద్ద ఆందోళన జరుగుతున్నట్టు భ్రమలు కల్పించొద్దు
మూడు రాజధానులు ఉంటే తప్పు ఏంటన్న దానిపై చర్చ మొదలైందని, ఇదేదో మహా అపరాధం అన్నట్టుగా, అమరావతిని ఎడారిని చేసేశారన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని ప్రాంత రైతులు ఒక ఉద్యమానికి దిగినట్టుగా, పెద్ద ఆందోళన జరుగుతున్నట్టుగా చంద్రబాబు భ్రమలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. 29 గ్రామాల ప్రజల ప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు టీడీపీకి పట్టవని ఘాటుగా విమర్శించారు. టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను చూస్తుంటే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలపైనా, అక్కడి వనరులపైనా తప్ప, ఇంకెవరి మీద ప్రేమ లేనట్టుగా ఉందని అన్నారు.
Amaravathi
Chandrababu
Minister
Kannababau

More Telugu News