Pawan Kalyan: నిన్నటి దాకా సింగపూర్.. ఇప్పుడు మంగళగిరిలో పవన్ షూటింగ్: మంత్రి వెల్లంపల్లి సెటైర్లు

  • అమరావతి రైతులకు ఇస్తున్న మద్దతుపై మంత్రి ఎద్దేవా
  • ఐదేళ్లుగా రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోలేదు
  • రాజధానిని తరలిస్తున్నామని ప్రకటించ లేదు
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన అమరావతి ప్రాంతంలో ఆందోళన చేపట్టిన రైతులను కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ పర్యటనపై స్పందిస్తూ.. పవన్ నిన్నటి దాకా సింగపూర్ లో షూటింగ్ చేశారని.. ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఐదేళ్లుగా రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లంపల్లి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.
Pawan Kalyan
Amaravathi
Farmers agitation
minister Vellampally Srinivas

More Telugu News