Philippines: ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థి దుర్మరణం

  • ఫిలిప్పీన్స్ లో కృష్ణా జిల్లా యువకుడి దుర్మరణం
  • బైక్ పై వెళుతుండగా ఢీకొన్న బస్సు
  • స్వగ్రామంలో విషాదం

ఫిలిప్పీన్స్ దేశంలో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పొన్నపల్లి జగదీశ్ అనే యువకుడు బైక్ పై వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగదీశ్ ఘటనస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. జగదీశ్ స్వస్థలం కృష్ణా జిల్లా నందిగామ నేతాజీ నగర్. వెటర్నరీ కోర్సు చదివేందుకు జగదీశ్ 2016లో ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ప్రస్తుతం ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. జగదీశ్ మరణవార్తతో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News