priyanka gandhi: దుర్గా సప్తశతి మంత్రాన్ని ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ

  • ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయె విచ్చై’ మంత్రం ట్వీట్
  • పలు రకాల కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
  • ఇటీవల వార్తల్లోని వ్యక్తిగా మారిన ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గత అర్ధరాత్రి ‘దుర్గా సప్తశతి’ మంత్రాన్ని ట్వీట్ చేశారు. సరిగ్గా అర్ధరాత్రి దాటాక 12:55 గంటలకు తన ట్విట్టర్ ఖాతాలో ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయె విచ్చై’అనే మంత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

రెండుమూడు రోజుల నుంచి ప్రియాంక వార్తల్లోని వ్యక్తి అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా  యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మీరట్ వెళ్లిన ప్రియాంకను పోలీసులు అడ్డుకున్నారు. వారి కళ్లుగప్పి తప్పించుకున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేత బైక్‌పై బయలుదేరారు. అయితే, ఆమె హెల్మెట్ లేకుండా ప్రయాణించారంటూ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
priyanka gandhi
Congress
Twitter

More Telugu News