ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి.. 119 ఏళ్ల కనిష్టానికి పగటి ఉష్ణోగ్రత
- ఢిల్లీలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
- శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు
- నోయిడాలో నేడు, రేపు స్కూళ్లకు సెలవు
మరోవైపు, పొగమంచు కారణంగా నిన్న 530 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో 20 విమానాలను దారి మళ్లించగా, నాలుగింటిని రద్దు చేశారు. ఇక, రైళ్లు అయితే, 2 నుంచి ఏడు గంటలు ఆలస్యంగా నడిచాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో నోయిడాలోని పాఠశాలలకు నేడు, రేపు సెలవులు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 11.8 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.