Janasena: రేపటి పవన్ కల్యాణ్ పర్యటనలో మార్పులు

  • రేపు రాజధాని ప్రాంత రైతులను కలవనున్న పవన్
  • సీఎం వెళ్లే మార్గం కావడంతో పర్యటనలో మార్పులు
  • ఎర్రబాలెంలో ధర్నాలో పాల్గొననున్న పవన్
అమరావతి రైతులను కలిసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు రాజధాని ప్రాంతాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మందడం, వెలగపూడి, తుళ్లూరు గ్రామాల రైతులతో ఆయన మాట్లాడనున్నట్టు తెలిపారు. అయితే, సీఎం జగన్ రేపు సచివాలయానికి వెళ్తున్న కారణంగా పవన్ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎర్రబాలెంలో నిర్వహించే ధర్నాలో పాల్గొన్న అనంతరం నేరుగా తుళ్లూరుకు పవన్ వెళ్లనున్నారు. అనంతరం, వెలగపూడి, మందడం వెళ్లి రైతులను కలుస్తారు. 
Janasena
Pawan Kalyan
Amaravathi
cm
Jagan

More Telugu News