GVL: ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదు: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రాజధానిపై జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించలేదని వివరణ
  • రాష్ట్ర సర్కారు అడిగితే సూచనలు చేస్తుందని వెల్లడి
ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్రం వైఖరి పట్ల క్రమంగా స్పష్టత వస్తోంది. ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించగా, తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా సరిగ్గా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు. రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించలేదని, రాజధాని మార్చాలని కూడా కేంద్రం చెప్పదని అన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే కేంద్రం సూచనలు చేస్తుందని తెలిపారు. ఇది తమ జాతీయ పార్టీ విధానమని వివరించారు. అసలు, రాజధానిపై ఏ పార్టీలోనూ ఏకాభిప్రాయం లేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
GVL
Andhra Pradesh
Amaravathi
YSRCP
Jagan
BJP

More Telugu News