Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి బ్రెయిన్ బెడ్!

  • మిచిగాన్ లో రోడ్డు ప్రమాదం
  • తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి
  • బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించిన డాక్టర్లు
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరింది. ఆమె పేరు చరితారెడ్డి. వయసు 25 సంవత్సరాలు. హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మిచిగాన్ లోని లాన్సింగ్ లో నివాసం ఉంటోంది. ఆమె ఓ ఐటీ నిపుణురాలు. తన కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైంది. వెనుక కారులోని డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్టు గుర్తించారు. కాగా, చరితారెడ్డి కోమాలోకి జారుకోవడంతో వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు.
Hyderabad
USA
Michigan
Charitha Reddy
Road Accident

More Telugu News