Andhra Pradesh: అమరావతి ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది: తమ్మినేని వ్యాఖ్యలు

  • రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు
  • అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమని ఆరోపణ
  • చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజధాని అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటవుతుందనే అంశంలో ఎవరికీ సందేహం అక్కర్లేదన్నారు. అమరావతి ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని, అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారని వివరించారు. అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నవారే రైతులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమవుతున్నారని తమ్మినేని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు అందుకే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తే మీకేంటి నష్టం? అంటూ ప్రశ్నించారు.
Andhra Pradesh
Amaravathi
Tamiineni Sitharam
Vizag
YSRCP
Jagan

More Telugu News