Amitabh Bachchan: నాన్నా.. మీరే నా హీరో.. మీరే స్ఫూర్తి: అభిషేక్ బచ్చన్

  • అమితాబ్ ‘దాదాసాహెబ్ పాల్కే’ అవార్డును అందుకున్న నేపథ్యంలో అభిషేక్ ట్వీట్
  • ఉత్తమ నటుడిగా  విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా
  • ఉత్తమ నటిగా కీర్తి సురేశ్
సినీరంగంలో అత్యున్నత పురస్కారం ‘దాదాసాహెబ్ పాల్కే’ అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అందుకున్న నేపథ్యంలో.. తనయుడు అభిషేక్ బచ్చన్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తన భావోద్వేగాలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న నా తండ్రికి శుభాకాంక్షలు. మీరే నా స్ఫూర్తి. నా హీరో. మిమ్మల్ని చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. లవ్ యూ’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక, తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో పెడుతూ.. ‘ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ణాపకం’ అని పేర్కొన్నారు.

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గత సోమవారం జరిగింది. అయితే, అనారోగ్యం కారణంగా తాను రాలేకపోతున్నట్లు అమితాబ్ ముందుగా నిర్వాహకులకు చెప్పడంతో.. ఆదివారం ప్రత్యేకంగా ఈ అవార్డును రాష్టపతి ఆయనకు అందించారు. ఉత్తమ నటిగా ‘మహానటి’ చిత్రంలో నటించిన కీర్తి సురేశ్ అవార్డును అందుకోగా, ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా అవార్డులను స్వీకరించారు. జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్న నటీనటులు, టెక్నీషియన్లకు రాష్ట్రపతి భవనల్లో నిన్న సాయంత్రం తేనీటి విందు ఏర్పాటు చేశారు.
Amitabh Bachchan
Received Dada Saheb Phalke award received
Abhishek Bachan conveys greetings

More Telugu News