YS: వైఎస్ ను నమ్మి గతంలో కొందరు సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు: దేవినేని ఉమ

  • జగన్ చెప్పినట్టు సంతకాలు పెడితే ఉన్నతాధికారులు జైలుకెళతారు
  • దొంగలను నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు
  • రియలెస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిని తరలిస్తున్నారు
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని నమ్మి కొందరు సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్టు సంతకాలు పెడితే... ఉన్నతాధికారులు మళ్లీ జైలుపాలవుతారని చెప్పారు. దొంగలను నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తులు మళ్లీ జైలుకే వెళ్తారని చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేవలం రియలెస్టేట్ వ్యాపారం కోసమే జగన్, విజయసాయిరెడ్డిలు రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. సీఎం భజన చేసే 10 మంది మంత్రులతో రాజధాని అంశంపై చెత్త కమిటీ వేశారని మండిపడ్డారు.
YS
Jagan
YSRCP
Devineni Uma

More Telugu News