Amaravati: గుంటూరు జిల్లా జైలుకు బయలుదేరిన చంద్రబాబునాయుడు!

  • నిన్న అరెస్ట్ అయిన ఆరుగురు రైతులు
  • పరామర్శించనున్న చంద్రబాబు
  • జైలు వద్ద పోలీసుల బందోబస్తు
నిన్న అమరావతి ప్రాంతంలో అరెస్ట్ చేసి, జైలుకు పంపిన ఆరుగురు రైతులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు  బయలుదేరారు. ప్రస్తుతం వారంతా గుంటూరు జిల్లా జైలులో ఉండగా, చంద్రబాబు జైలుకు వెళ్లి వారితో మాట్లాడనున్నారు. ఇప్పటికే రైతుల అరెస్ట్ కు నిరసనగా జైలు ఎదుట మాజీ మంత్రులు ఆలపాటి రాజా, పుల్లారావు, నక్కా ఆనందబాబు నిరసనలు తెలియజేస్తుండగా, వారికి సంఘీభావంగా చంద్రబాబు కూడా నిరసనల్లో పాల్గొననున్నారు. బాబు రాక నేపథ్యంలో జైలు వద్ద బందోబస్తును పెంచారు.
Amaravati
Farmers
Chandrababu
Jail

More Telugu News