Andhra Pradesh: ఆంధ్రా రాజధానిపై వేల మంది షేర్ చేస్తున్న పోస్ట్ ఇది!

  • ఆంధ్రా పొడవునా సముద్రం
  • పెద్ద షిప్ లో అసెంబ్లీని పెట్టాలి
  • దాన్ని తిప్పుతుంటే అందరి వద్దకూ రాజధాని
  • నవ్వులు పూయిస్తున్న పోస్ట్
తొలుత ఎవరు పోస్ట్ చేశారో తెలియదుగానీ, ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెట్టింట ఇప్పుడు ఓ జోక్ తెగ వైరల్ అవుతోంది. వేల మంది ఈ సెటైర్ ను తమ మిత్రులకు షేర్ చేస్తున్నారు. ఆపై నవ్వుకుంటున్నారు. రాజధాని అమరావతి బదులుగా మూడు ప్రాంతాల్లో రాజధానిని అభివృద్ధి చేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత, నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ఏంటో తెలుసా?

"ఆంధ్రా పొడవునా సముద్రం వుంది కాబట్టి, అసెంబ్లీ మరియు ప్రభుత్వ కార్యాలయాలు ఒక రెండు పెద్ద టైటానిక్ లాంటి షిప్స్ లో పెట్టి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నెలకు ఒకసారి అటూ ఇటూ తిప్పితే, రాజధాని అందరి దగ్గరకూ వచ్చినట్టుంది ప్లస్ ఒక ఫ్లోటింగ్ కాపిటల్ గా ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. ఎవరి భూములూ, రియల్ ఎస్టేట్లు అవసరం లేదు. ఏమంటారూ?" అనేదే ఆ పోస్ట్.  
Andhra Pradesh
Capital
Costal
Titanic
Ship

More Telugu News