Indian Railways: రైలు డోర్ దగ్గర ఫీట్ చేస్తూ, పట్టుతప్పి యువకుడి మృతి... వీడియో తీసిన ఫ్రెండ్!

  • ముంబై లోకల్ రైల్ లో ఘటన
  • వైరల్ అవుతున్న వీడియో
  • ఇటువంటి ఫీట్స్ వద్దన్న రైల్వే శాఖ
రైళ్లలో ప్రయాణిస్తున్న వేళ, యువత అనాలోచితంగా ఫీట్స్ కు పాల్పడవద్దని చెబుతూ, రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన ఓ ట్వీట్, అందులోని వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో రైలు డోర్ ను పట్టుకుని ఫీట్స్ చేస్తున్న యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అతని ఫీట్స్ ను మరో యువకుడు వీడియో తీశాడు.

 ఫీట్స్ చేస్తున్న యువకుడు మరణించాడని, అతని పేరు దిల్షాన్ అని రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 26న ముంబై లోకల్ రైల్ లో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. రైళ్లలో ఇటువంటి స్టంట్స్ కూడదని, చట్ట విరుద్ధమైన ఈ తరహా చర్యలతో ప్రాణాలు కూడా కోల్పోవచ్చని హెచ్చరించింది. యువత ఇటువంటి ఫీట్స్ కు దూరంగా ఉండాలని సూచించింది. రైల్వే శాఖ ట్వీట్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.
Indian Railways
Mumbai
Local Train
Feets
Dangerous

More Telugu News