Kesineni Nani: అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన: కేశినేని నాని

  • 34 వేల ఎకరాలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు
  • అనేక మంది రైతుల త్యాగం అమరావతి
  • రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చేయాలన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆలోచన అని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిగా ఉండాలంటూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ... రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు.

అనేక మంది రైతుల త్యాగం అమరావతి అని కేశినేని నాని అన్నారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు. రైతుల పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శించే ఏ ప్రభుత్వం మనుగడ సాగించబోదని ఆయన అన్నారు. రాజధాని కోసం, రైతుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.
Kesineni Nani
Telugudesam
amaravati

More Telugu News