amaravathi: రాజధానిపై కన్నా మాటే మా మాట: సీఎం రమేశ్

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ 
  • ఈ సందర్భంగా రాజధానిపై స్పందన 
  • ఇంకా అధిష్ఠానంతో తాను మాట్లాడలేదని వివరణ

రాజధాని అమరావతి మార్పుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్ నర్మగర్భమైన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తానింకా అధిష్ఠానంతో మాట్లాడలేదని తెలిపారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన రమేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 'ప్రస్తుతానికైతే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నందున మా స్పందన కూడా అదే అనుకోండి' అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. ఇక, సీఏఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే పెట్టిందని, విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ప్రజల్ని తప్పుతోవ పట్టించి విధ్వంసం సృష్టిస్తున్నాయన్నారు.

amaravathi
capital change
CM Ramesh
kanna

More Telugu News