KTR: సినిమాల్లో నటించేంత సమయం నాకు లేదు: కేటీఆర్

  • సినిమాల్లో నటించాలనుకుంటే ఎలాంటి సినిమాలో నటిస్తారని ప్రశ్నించిన నెటిజన్
  • మీరు నటించాలనుకుంటే సినిమా అవకాశం ఇస్తామని ఆఫర్
  • నాకు ఫుల్ టైమ్ జాబ్ ఉందన్న కేటీఆర్
సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎంతో మంది తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకొస్తుంటారు. ఆయన కూడా సత్వరమే స్పందించి వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటుంటారు. అంతేకాదు, అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు.

తాజాగా ఓ నెటిజన్ నుంచి కేటీఆర్ కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ సినిమాల్లో నటించాలనుకుంటే... ఎలాంటి సినిమాలో నటిస్తారు? మీరు నటించాలనుకుంటే సినిమా అవకాశం ఇస్తామని ఓ నెటిజన్ అన్నారు. దీనికి సమాధానంగా సదరు నెటిజన్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఫుల్ టైమ్ జాబ్ ఉందని... సినిమాల్లో నటించేంత సమయం తనకు లేదని ఆయన చెప్పారు.
KTR
TRS

More Telugu News