Srimukhi: అనంతపురంలో యాంకర్ శ్రీముఖి సందడి!

  • హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన శ్రీముఖి
  • చూసేందుకు పెద్దఎత్తున తరలిన ప్రజలు
  • ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడిన జనం 
ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్, బిగ్ బాస్-3 సీజన్ రన్నరప్ శ్రీముఖి, అనంతపురంలో సందడి చేసింది. ఇక్కడ ఓ హోటల్ ఓపెనింగ్ కు ఆమె రాగా, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పూల బొకేలను ఇచ్చి, ఆటోగ్రాఫ్‌ లు తీసుకుని ఆనందించారు. బెంగళూరు హైవేలో కొత్తగా నిర్మించిన హోటల్‌ 'బ్లిస్‌ ఆనంద్‌'ను ఆమె ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో హిందూపురం లోక్ సభ సభ్యుడు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ దంపతులు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Srimukhi
Anantapur District
Hotel Bliss
Opening

More Telugu News