Uttarandhra: ఉత్తరాంధ్రలో అవంతి, వైసీపీ నేతలు వేల ఎకరాలు కబ్జా చేశారు: టీడీపీ నేత మంతెన ఆరోపణ

  • టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి అవంతి కళ్లకు కనిపించట్లేదా?
  • జగన్ వి స్వార్థ రాజకీయాలు
  • విశాఖ ఉత్సవ్ తర్వాత జగన్ ఎందుకు మాట్లాడకుండా వెళ్లారు?
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపణలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి అవంతి కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం కంపెనీలను తరిమేసినప్పుడు అవంతి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో అవంతి, వైసీపీ నేతలు వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ బాగోతం ప్రజలకు తెలుస్తుందనే, విశాఖ ఉత్సవ్ లో సీఎం జగన్ ప్రసంగించకుండా వెళ్లిపోయారని విమర్శించారు.
Uttarandhra
cm
Jagan
YSRCP
Minister
Avanthi
Telugudesam
Mantena satyanarayana raju

More Telugu News