Andhra Pradesh: రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు అవసరంలేదా?: అవంతి

  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి అవంతి
  • పేదరైతులను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపణలు
  • తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని మండిపాటు
ఏపీ రాజధాని అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో పేద రైతులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 13 జిల్లాల ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారా లేక రెండు జిల్లాల ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు అవసరంలేదా అని నిలదీశారు. చంద్రబాబు తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. కొందరు ఢిల్లీలో నాయకులను అడ్డం పెట్టుకుని న్యాయవ్యవస్థ ద్వారా రాజధానిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే వారి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Andhra Pradesh
YSRCP
Amaravathi
Avanthi Srinivasarao
Chandrababu

More Telugu News