Karimnagar: మన దేశంలో ఉంటున్న కోట్ల మంది చొరబాటు దారులు అలజడి సృష్టిస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • భారతదేశం అనేక మందికి ఆశ్రయం కల్పించింది
  • దలైలామాను అన్ని రకాలుగా గౌరవిస్తున్నాం
  • అటువంటి గొప్పదేశం మనది
భారతదేశం అనేక మందికి ఆశ్రయం కల్పించిందని, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, టిబెట్ కు చెందిన బౌద్ధ గురువు దలైలామాను మన దేశంలో అన్ని రకాలుగా గౌరవిస్తున్నామని, ఆయన్ని నుంచి స్ఫూర్తి పొందుతున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల మహా సమ్మేళన్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అటువంటి గొప్పదేశం మనదని, కానీ, కోట్లాది మంది చొరబాటుదారులు మన దేశంలోకి వచ్చి ఉంటూ ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఇది దురదృష్టకరంగా భావించారు. కొన్ని దేశాల్లో మతం పేరిట అనేక రకాల వేధింపులకు, వివక్షకు గురైన వాళ్లకు ఇక్కడ ఆశ్రయం కల్పించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.
Karimnagar
Saraswathi
Sisu Mandir
Kishanreddy

More Telugu News