ములాయంసింగ్ యాదవ్ కు అస్వస్థత
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా పొత్తికడుపు సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ములాయం సింగ్ ను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో ములాయం చేరినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ములాయంను ఈరోజు డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.