Andhra Pradesh: హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయం: మంత్రి మోపిదేవి

  • అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ 
  • గత పొరపాట్లు పునరావృతం కాకుండా నిర్ణయాలుంటాయి
  • అమరావతి పేరిట జరిగిన అక్రమాలు బటయకు వస్తాయి
అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...  హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయం అన్నారు. గత పొరపాట్లు పునరావృతం కాకుండా నిర్ణయాలుంటాయని చెప్పారు.

అమరావతి పేరిట జరిగిన అక్రమాలు బటయకు వస్తాయని మంత్రి మోపిదేవి చెప్పారు. ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు వెళ్లాయన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు.
Andhra Pradesh
amaravati

More Telugu News