rss: మన భాషతోనే మన జీవన విధానాన్ని స్పష్టంగా చెప్పవచ్చు: మోహన్ భగవత్

  • ఈ దేశం కోసం బలిదానాలు చేసిన వారు చరిత్రలో ఉన్నారు
  • వ్యక్తికి ఎప్పుడూ నేనొక్కడినే అన్న భావన కలగరాదు
  • వ్యక్తి తనకు తానూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి
మన భాషతోనే మన జీవన విధానాన్ని స్పష్టంగా చెప్పవచ్చని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ లోని శ్రీ సరస్వతీ విద్యాపీఠంలో పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ... 'పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు వ్యక్తిగత ఆనందాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ దేశం కోసం బలిదానాలు చేసిన వారు చరిత్రలో ఉన్నారని అన్నారు. వ్యక్తికి ఎప్పుడూ నేనొక్కడినే అన్న భావన కలగరాదని చెప్పారు. వ్యక్తి తనకు తానూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలని అన్నారు. విద్యాభారతిలో అభ్యసించిన విద్యార్థులకు నైతిక, జీవన విలువలు పెంపొందుతున్నాయని చెప్పారు.

rss
mohan bhagavat

More Telugu News