Vijay Sai Reddy: ఇదే కదా అభిమానం.. ఇది కదా విశ్వాసం: విజయసాయి రెడ్డి

  • విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుంది
  • ఈ విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారు
  • అభివృద్ధి ప్రదాత జగన్ 
  • ఆయనకు థాంక్స్ చెబుతూ.. బీచ్ లో ఎగిసిపడే అలల్లా ప్రజలు వచ్చారు
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రకటన చేసిన అనంతరం ఆయన తొలిసారి నిన్న విశాఖపట్నంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన విజయవంతమైందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జనం నీరాజనం పట్టారని ఆయన చెప్పుకొచ్చారు.

విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 'అభివృద్ధి ప్రదాత జగన్ గారికి థాంక్స్ చెబుతూ.. బీచ్ లో ఎగిసిపడే అలల్లా.. విశాఖ వీధులన్నీ జనసంద్రంతో ఉప్పొంగాయి. ఇదే కదా అభిమానం.. ఇది కదా విశ్వాసం' అని ఆయన చెప్పుకొచ్చారు.
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News