Merut: ఇద్దరు ముస్లింలను 'పాక్ కు వెళ్లిపోండి' అంటూ గద్దించిన మీరట్ ఎస్పీ... చర్యలకు కేంద్రమంత్రి డిమాండ్!

  • ఎస్పీగా పనిచేస్తున్న అఖిలేశ్ నారాయణ్ సింగ్
  • వైరల్ అయిన వీడియో
  • చర్యలు తీసుకోవాలని ముఖ్తార్ అబ్బాస్ నక్వీ డిమాండ్
నిరసనలకు దిగిన ఇద్దరు ముస్లింలను ఉద్దేశించి, మతాన్ని ప్రస్తావిస్తూ, వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించారు. మీరట్ ఎస్పీగా పనిచేస్తున్న అఖిలేశ్ నారాయణ్ సింగ్, ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించిన 'పాక్ వెళ్లిపోండి' అని గద్దించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఎస్పీ వ్యాఖ్యలపై విమర్శలూ వెల్లువెత్తాయి.

"హింస ఏ స్థాయిలో ఉన్నా, పోలీసు ఉన్నతాధికారి ప్రవర్తించిన తీరు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సహించబోము. అమాయక ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన పోలీసులు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు" అని అన్నారు. నారాయణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆయన డిమాండ్ చేశారు.
Merut
Police
Muslims
Pakistan
Mukhtar Abbas Naqui

More Telugu News