Amaravathi: రాజధాని గ్రామాల రైతులు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో తనిఖీలు 
  • అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ రైతుల ధ్వజం 
  • విడిచి పెట్టకుంటే పీఎస్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక

రాజధాని అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నలుగురు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాజధాని రైతుల్లో ఆందోళనకు కారణమైంది. అకారణంగా పోలీసులు తమను అరెస్టు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలోకి పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేపట్టారని, అక్రమంగా పలువురిని అరెస్టు చేశారంటూ ఆరోపించారు. పోలీసుల చర్యతో రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతుల్ని విడిచి పెట్టకుంటే పీఎస్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Amaravathi
farmers
four arrest
Police

More Telugu News