ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయుడి సహా ఆరుగురి దుర్మరణం
- వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన ట్రక్కు
- 26 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు
- మృతుల్లో ఇద్దరు మలేషియా, ముగ్గురు ఈజిప్ట్ వాసులు
ఈ క్రమంలో వెనక వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొంది. రెండో బస్సులో ఆస్ట్రేలియా పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు భారత్, ఇద్దరు మలేషియా, ముగ్గురు ఈజిప్టు వాసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కైరోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాద ఘటనను కైరోలోని రాయబార కార్యాలయం ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.