Pezawar Math: మరణశయ్యపై పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామి... చివరి కోరికను తీర్చిన శిష్యులు!

  • గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్న ఆరోగ్యం
  • ఇక తిరిగి కోలుకునే అవకాశాలు లేవన్న వైద్యులు
  • చివరి రోజులను గడిపేందుకు మఠానికి తరలింపు
కర్ణాటకలోని ప్రముఖ మఠాల్లో ఒకటైన పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమమైంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ రాగా, బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఆయన శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటీ పని చేయని స్థితికి రావడంతో, వైద్యులు చేతులెత్తేశారు. ఆయన తిరిగి కోలుకునే అవకాశాలు లేవని చెప్పారు. దీంతో ఆయన చివరి కోరికను తీర్చాలని శిష్యులు నిర్ణయించారు. ఆసుపత్రిలో చేరిన సమయంలోనే, తన చివరి రోజులను మఠంలోనే గడపాలని ఉందని, అదే తన చివరి కోరికని ఆయన తన శిష్యులకు చెప్పారు. దీంతో మణిపాల్ ఆసుపత్రి నుంచి విశ్వేశ్వర తీర్థ స్వామిని పెజావర్ మఠానికి తరలించారు.
Pezawar Math
Vishveshwara Teertha
Karnataka

More Telugu News