Actor Siddarth: నాకు నిజాలు మాట్లాడడం మాత్రమే వచ్చు.. రాజకీయ అరంగేట్రంపై నటుడు సిద్ధార్థ్ క్లారిటీ!

  • ప్రచారాన్ని తిప్పి కొట్టిన సిద్ధార్థ్
  • రాజకీయాలకు తాను సూట్ కానన్న నటుడు
  • రాజకీయ నాయకుడికి చాలా విషయాలు తెలిసి ఉండాలన్న సిద్ధార్థ్
త్వరలో రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ నటుడు సిద్ధార్థ్  స్పందించాడు. తనకు అంత సీన్ లేదని తెగేసి చెప్పాడు. రాజకీయ నాయకుడిని కావాలనే ఉద్దేశం తనకు లేదన్నాడు. తనలా మాట్లాడేవాళ్లు రాజకీయాల్లో ఉండలేరని పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా విషయాలు తెలిసి ఉండడంతోపాటు, ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలన్న విషయం కూడా తెలిసి ఉండాలన్నాడు. సరైన సమయంలో సరైన విషయాన్ని ప్రస్తావించడం తెలియాలన్నాడు.

తనకు నిజం మాట్లాడడం మాత్రమే తెలుసని సిద్ధార్థ్ అన్నాడు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తన అభిప్రాయాలు మాత్రమేనని, అంతకుమించి మరేమీ లేదని స్పష్టం చేశాడు. సమస్యలపై స్పందించకపోతే తప్పు చేసినట్టుగానే భావిస్తానని సిద్ధార్థ చెప్పుకొచ్చాడు. అతడి తాజా వ్యాఖ్యలతో రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలకు తెరపడినట్టేనని భావిస్తున్నారు.
Actor Siddarth
politics

More Telugu News