Jagan: విశాఖపట్నంలో మాట్లాడకుండానే వెళ్లిపోయిన సీఎం జగన్!

  • నిన్న ప్రారంభమైన విశాఖ ఉత్సవ్
  • భారీగా హాజరైన ప్రజలు, సందర్శకులు
  • సందేశం ఇవ్వకుండానే వెళ్లిపోయిన జగన్
నిన్న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏ విధమైన సందేశం ఇవ్వకుండానే స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమం వైభవంగా జరుగగా, భారీ ఎత్తున ప్రజలు, సందర్శకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రిని పలువురు సన్మానించారు. ఆ తరువాత జగన్ మాట్లాడతారని, విశాఖకు మరిన్ని వరాలను ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, జగన్ మాత్రం తనను సన్మానించిన వారికి ధన్యవాదాలు తెలిపి, వెళ్లిపోయారు.

అంతకుముందు జగన్ అభివృద్ధి అజెండాను ప్రతిబింబించేలా ప్రత్యేక లఘుచిత్రాన్ని నిర్మాహకులు ప్రదర్శించారు. విశాఖపై జగన్‌ కు ఎంతో అభిమానమని చెప్పేలా దీన్ని రూపొందించారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. .
Jagan
Vishakha Utsav
Vizag

More Telugu News