Devineni Uma: 100 మీటర్లు కూడా నడవలేని జీఎన్ రావు 10 వేల కిలోమీటర్లు తిరిగాడంట!: దేవినేని ఉమ

  • వైసీపీ సర్కారుపై దేవినేని ఉమ విసుర్లు
  • జీఎన్ రావు కమిటీ గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు
  • బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పై అవినీతి ఆరోపణలున్నాయన్న ఉమ
ఏపీలో ప్రస్తుతం జీఎన్ రావు కమిటీ పేరు ఎక్కువగా చర్చకు వస్తోంది. రాజధానిపైనా, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనా అధ్యయనం చేసిన ఈ కమిటీ కొన్నిరోజుల క్రితమే ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. అయితే ఈ కమిటీపై విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గట్టిగా 100 మీటర్లు కూడా నడవలేని జీఎన్ రావు 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఎవరెవర్ని కలిశారో సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించగలరా? అంటూ సవాల్ విసిరారు.

ఐదు కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే బాధ్యతను అవినీతి ఆరోపణలు ఉన్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కు అప్పగించారని, అయితే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి, ఆ బోస్టన్ కంపెనీకి ఉన్న సంబంధం ఏమిటి అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Devineni Uma
Andhra Pradesh
YSRCP
Jagan
GN Rao
Telugudesam

More Telugu News