IPL: ఈ దశాబ్దపు ఐపీఎల్ జట్టును ఎంపిక చేసిన విజ్డెన్... కెప్టెన్ ఎవరో చూడండి!

  • రోహిత్ శర్మకు కెప్టెన్సీ
  • ధోనీని వికెట్ కీపర్ గానే పరిగణించిన విజ్డెన్
  • 12వ ఆటగాడిగా డ్వేన్ బ్రావో
ప్రఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ ఈ దశాబ్దపు ఐపీఎల్ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇందులో భారత్ నుంచి కోహ్లీ, రైనా, ధోనీ, జడేజా, భువనేశ్వర్ కుమార్, బుమ్రా ఎంపికయ్యారు.  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను పలు సీజన్లలో విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీని విజ్డెన్ కేవలం వికెట్ కీపర్ గానే ఎంపిక చేసింది. ఇక, విదేశీ ఆటగాళ్లలో క్వింటన్ డికాక్, మలింగ, ఏబీ డివిలియర్స్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో (12వ ఆటగాడు)లను మిగిలిన జట్టు సభ్యులుగా పేర్కొంది. ధోనీ చెన్నై జట్టును మూడు సార్లు విజేతగా నిలపగా, రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ ను నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. ఈ కారణంగానే విజ్డెన్ యాజమాన్యం రోహిత్ ను కెప్టెన్ గా పేర్కొంది.
IPL
Wisden
Rohit Sharma
MS Dhoni
Virat Kohli
Team

More Telugu News