Telugu: తెలుగు భాషపై టీడీపీ నేతలకే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు: అంబటి

  • మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు
  • టీడీపీ నేతలపై విమర్శలు
  • అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషపై టీడీపీ నాయకులకే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాతృ సమాన భాష తెలుగును వైసీపీ ప్రభుత్వం ఎల్లవేళలా గౌరవిస్తుందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కొన్ని పత్రికలు కూడా వారికి వంతపాడుతున్నాయని అన్నారు. ఇప్పటి పోటీ ప్రపంచంలో యువత ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి అని అంబటి వివరణ ఇచ్చారు. తాము ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామంటే వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారంటూ ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని వెల్లడించారు.
Telugu
Andhra Pradesh
YSRCP
Telugudesam
Ambati Rambabu

More Telugu News