Harish Rao: జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల సన్నద్ధతను స్వయంగా పరీక్షించిన హరీశ్ రావు

  • టీచర్ అవతారం ఎత్తిన హరీశ్ రావు
  • సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ హైస్కూలులో తనిఖీలు
  • టీచర్లకు అక్షింతలు
తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంగారెడ్డి జిల్లా కంది జడ్పీ హైస్కూల్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మరికొన్ని నెలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, విద్యార్థుల సన్నద్ధత ఎలా ఉందో పరీక్షించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులను పిలిచి వారిని పలు విధాలుగా ప్రశ్నించారు. గణితం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో అనేక ప్రశ్నలు అడిగారు. కొందరు స్టూడెంట్లు కనీసం ఎక్కాలు కూడా చెప్పలేకపోగా, మరికొందరు పేర్లు కూడా రాయలేక హరీశ్ రావును అసంతృప్తికి గురిచేశారు. దీనిపై అక్కడే ఉన్న టీచర్లను ప్రశ్నించారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే తీరు ఇదేనా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Harish Rao
Telangana
TRS
ZPHS
10th Class
Students

More Telugu News