Visakhapatnam District: విశాఖ వచ్చిన సీఎం జగన్ కు దారిపొడవునా ప్రజల ఘనస్వాగతం
ఏపీ భావి రాజధానిగా ప్రచారం అందుకుంటున్న విశాఖపట్నం నగరానికి ఏపీ సీఎం జగన్ విచ్చేశారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవంతో పాటు అనేక అభివృద్ధి పనుల ప్రారంభానికి వచ్చిన ఆయనకు జనం నీరాజనం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. సుమారు 24 కిలోమీటర్ల వరకు ప్రజలు మానవహారంలా ఏర్పడిన వైనాన్ని సీఎం జగన్ తన కాన్వాయ్ నుంచి వీక్షించారు. అయితే సీఎం జగన్ ఉన్న కారును గుర్తించిన ప్రజలు ఆయనతో సెల్ఫీల కోసం ముందుకు ఉరకడంతో పోలీసులు స్పందించాల్సి వచ్చింది.