Vijay: భారీ రేటుకు విజయ్ మూవీ హక్కులు

షార్ట్స్‌లో చూడండి
కొంతకాలంగా విజయ్ భారీ విజయాలతో దూసుకుపోతున్నాడు. తెలుగులో ఇటీవల వచ్చిన 'విజిల్' మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో తెలుగులోను విజయ్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తాజా చిత్రం రూపొందుతోంది.

ఒక వైపున 'ఖైదీ' సినిమాతో లోకేశ్ కనగరాజ్ .. మరో వైపున 'విజిల్' తో విజయ్ భారీ హిట్స్ ఇచ్చి వున్నారు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ అంచనాల కారణంగానే తెలుగు హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగులో 'విజిల్' ను విడుదల చేసిన మహేశ్ కోనేరు, ఈ సినిమా తెలుగు హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన 8.75 కోట్ల రూపాయలను చెల్లించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Vijay
Lokesh

More Telugu News