Ranga Marthanda: ప్రకాశ్ రాజ్ విందు... మరోసారి కలిసిన రాహుల్, పునర్నవి

  • హైదరాబాదులో రంగమార్తాండ షూటింగ్
  • ప్రధానపాత్రలో ప్రకాశ్ రాజ్
  • రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్న రాహుల్
బిగ్ బాస్ మూడో సీజన్ లో విజేతగా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ ఇంట్లో వీరిద్దరి కెమిస్ట్రీకి వీక్షకులు విపరీతంగా ఆకర్షితులయ్యారంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత కూడా రాహుల్, పునర్నవి కలిస్తే అదో వార్త అయ్యేది. ఇప్పుడూ అంతే! తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇచ్చిన పార్టీలో ఈ యువ జోడీ తళుక్కున మెరిసింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇందులో రాహుల్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో తన ఫేవరెట్ సాంగ్ 'ఏమైపోయావే నీవెంటే నేనుంటే' ను రాహుల్ హృద్యంగా ఆలపించగా, పునర్నవి చిరునవ్వుతో కాలు కదిపింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి.


Ranga Marthanda
Prakash Raj
Rahul Sipligunj
Punarnavi
Krishnavamsi

More Telugu News